తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశ కీర్తిని ప్రపంచానికి చాటింది: బండారు దత్తాత్రేయ - బండారు దత్తాత్రేయ తాజా వార్తలు

చెస్ ఒలంపియాడ్‌లో భారత్ దేశానికి ప్రప్రథమంగా స్వర్ణ పతకం సాధించిన తెలుగు బిడ్డ కోనేరు హంపిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందించారు. దేశ కీర్తి ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన కోనేరు హంపికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో అనేకమైన విజయాలను సాధించాలని కోరారు.

దేశ కీర్తిని ప్రపంచానికి చాటింది: బండారు దత్తాత్రేయ
దేశ కీర్తిని ప్రపంచానికి చాటింది: బండారు దత్తాత్రేయ

By

Published : Aug 31, 2020, 11:11 PM IST

ఫైడ్ ఆన్లైన్ ఒలంపియాడ్ చదరంగంలో భారత దేశానికి మొట్టమొదటి సారి చారిత్రాత్మకంగా స్వర్ణ పథకం సాధించిన ప్రప్రథమ మహిళ, తెలుగు బిడ్డ కోనేరు హంపిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందించారు. కోనేరు హంపి మేథా కృషితో, అంకిత భావంతో పిన్న వయస్సులోనే దేశ కీర్తిని ప్రపంచానికి చాటడం తెలుగు ప్రజలకు గర్వకారణమని ఆయన కొనియాడారు.

దేశ కీర్తి ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన కోనేరు హంపికి బండారు దత్తాత్రేయ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో అనేకమైన విజయాలను సాధించాలని కోరారు.

ఇదీ చదవండి:భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ అస్తమయం

ABOUT THE AUTHOR

...view details