తెలంగాణ

telangana

ETV Bharat / state

బండారు దత్తాత్రేయ భార్య వసంతకు కరోనా పాజిటివ్​ - bandaru dathathreya latest news

హిమాచల్​ప్రదేశ్​ రాజ్​భవన్​లో కరోనా కలకలం రేగింది. ఆ రాష్ట్ర గవర్నర్​ బండారు దత్తాత్రేయ భార్య వసంతకు కొవిడ్​ వచ్చింది. ఆమెను సిమ్లాలోని ఐజీఎంసీ ఆస్పత్రిలో చేర్చారు.

bandaru dathathreya
బండారు దత్తాత్రేయ

By

Published : May 17, 2021, 7:49 PM IST

హిమాచల్​ప్రదేశ్​ గవర్నర్​ బండారు దత్తాత్రేయ భార్య వసంతకు కరోనా సోకింది. ఆమెకు రెండు రోజులుగా ఆరోగ్యం బాగలేకపోవటంతో కొవిడ్​ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో వసంతకు కరోనా నిర్ధరణయింది. ఆమెను ఐజీఎంసీ ఆస్పత్రిలో చేర్చారు.

వసంత ఇప్పటికే కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నారు. రాజ్​భవన్​లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులకు కూడా కొవిడ్​ బారిన పడ్డారు. బండారు దత్తాత్రేయకు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్​గా తేలింది. దత్తాత్రేయ కూడా వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్నారు. వసంతతో మరో ఇద్దరు ఉద్యోగులకు పాజిటివ్ రావడంతో.. ఇతర ఉద్యోగులను హోం ఐసోలేషన్​లో ఉంచారు.

ఇదీ చదవండి:ఏపీ ఎంపీ రఘురామ సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలింపు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details