తెలంగాణ

telangana

ETV Bharat / state

'పాసవాన్ మరణం దేశానికి తీరని లోటు' - Dattatreya on Central minister pasawan demise

కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ మరణం పట్ల కేంద్ర హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు.

datanna
datanna

By

Published : Oct 8, 2020, 10:52 PM IST

కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ మరణం దేశానికి తీరని లోటని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన వ్యక్తి అని కొనియాడారు.

జాతీయ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఆయన వ్యక్తిత్వం, దేశ ప్రజలకు సేవ చేయాలనే తత్వం ఎప్పటికీ మరువలేమన్నారు. పాసవాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

పాసవాన్ మృతి పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:కాంగ్రెస్​, భాజపాలు రెండూ రెండే.. రైతులకు మేలు జరగదు: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details