హైదరాబాద్ మసబ్ ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో హైటెన్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తమ నూతన ఉత్పత్తుల వివరాలను వెల్లడించింది. పండ్లు మగ్గడానికి వినియోగిస్తున్న కాల్షియం కార్బైట్, చైనా పౌడర్ వల్ల అనేక అనర్థాలు, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆ సంస్థ డైరక్టర్ ప్రమోద్ రెడ్డి తెలిపారు. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా హైటెన్ ఉత్పత్తులను తీసుకొచ్చినట్లు చెప్పారు. తమ ఉత్పత్తులను ఫుడ్ సేఫ్టీ ఆథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగుళూరు, హైదరాబాద్ సంస్థలు పూర్తిగా సురక్షితమని పేర్కొన్నట్లు తెలిపారు. తమ ఉత్పత్తులు పూర్తిగా గంజి, ఎథిలిన్ గ్యాస్‌తోనే ఉత్పత్తి చేశామన్నారు. తమ హైటెన్ ఉత్పత్తి ఎన్ రిప్తో మామిడిపండ్లు మూడు రోజుల్లో మగ్గుతాయన్నారు. తమ పాకెట్ కు చిన్న రంద్రం చేసి...పండ్లు ఉన్న ట్రేలో కింది భాగాన ఉంచితే చాలన్నారు. అరటిపండ్లు, సీతాఫలం వంటి పండ్లు కేవలం 24 గంటల్లోనే మగ్గుతాయన్నారు.
పండ్లు మగ్గటానికి హైటెన్ ఉత్పత్తులు
పండ్లను మగ్గపెట్టడానికి హైటెన్ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయని హైటెన్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రమోద్ రెడ్డి తెలిపారు. హైటెన్ పూర్తిగా ప్రకృతి సిద్దంగా తయారు చేయబడిన..ఆరోగ్యకరమైన ఉత్పత్తులని తెలిపారు. హైదరాబాద్ మసబ్ ట్యాంక్‌లోని సాంకేతిక విద్యాభవన్‌లో తమ ఉత్పత్తుల వివరాలను వెల్లడించారు.
ఉత్పత్తులు విడుదల చేస్తున్న హైటెన్ ఉత్పత్తులు