తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉస్మానియాను పునరుద్ధరిస్తారా లేక కొత్తగా నిర్మిస్తారా?: హైకోర్టు - Telangana news

ఉస్మానియాను పునరుద్ధరిస్తారా లేక కొత్తగా నిర్మిస్తారా?: హైకోర్టు
ఉస్మానియాను పునరుద్ధరిస్తారా లేక కొత్తగా నిర్మిస్తారా?: హైకోర్టు

By

Published : Feb 25, 2021, 3:29 PM IST

Updated : Feb 25, 2021, 4:51 PM IST

15:24 February 25

ఉస్మానియాను పునరుద్ధరిస్తారా లేక కొత్తగా నిర్మిస్తారా?: హైకోర్టు

ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణంపై ఆరేళ్లుగా నిర్ణయం తీసుకోలేక పోతున్నారా అని... ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆస్పత్రి పునర్‌ నిర్మించాలంటూ దాఖలైన అన్ని వ్యాజ్యాలపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. 

ఆస్పత్రిని కొత్తగా నిర్మిస్తారో లేదా పునరుద్ధరిస్తారో నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు... ప్రభుత్వ వైఖరిని నాలుగు వారాల్లోగా చెప్పాలని ఆదేశించింది. వారసత్వ కట్టడాలను కూల్చొద్దన్న వాదనను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది. ఆస్పత్రి స్థలం ప్లానుతో పాటు సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉస్మానియా ఆసుపత్రి భవనం స్థానంలో ఆధునిక వసతులతో రెండు బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించి ఆరేళ్లు గడిచినా.. ఆ దిశగా అడుగులు పడటంలేదు. వారసత్వ భవనంగా గుర్తింపు ఉండడంతో.. నూతన భవన నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఉస్మానియా ఆస్పత్రిపై దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం... ఆస్పత్రిపై ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించింది. సర్కారు వైఖరేంటో నాలుగు వారాల్లోగా చెప్పాలని ఆదేశించింది. 

ఇదీ చూడండి:ఉత్తమ్ సమక్షంలోనే కాంగ్రెస్​ నాయకుల గొడవ

Last Updated : Feb 25, 2021, 4:51 PM IST

ABOUT THE AUTHOR

...view details