మార్కెట్లు, వాణిజ్య సముదాయాలు, రద్దీ ప్రాంతాల్లో క్రిమి సంహారక టన్నెల్లు ఏర్పాటు చేసే అంశంపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నివేదించింది. రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం నిర్వహించడం అంత సులువు కాదని.. అందుకే క్రిమి రహిత ప్రాంతాలుగా మార్చేందుకు టన్నెల్లు ఏర్పాటు చేయాలని కోరుతూ.. న్యాయవాది రొనాల్డ్ రాజు వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది.
'టన్నెల్లు ఏర్పాటు చేస్తున్నారా? నివేదిక సమర్పించండి'
వాణిజ్య సముదాయాలు, రద్దీ ప్రాంతాల్లో క్రిమి సంహారక టన్నెల్లు ఏర్పాటు చేసే అంశంపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నివేదించింది.
ఒక్కో టన్నెల్ ఖర్చు రూ. 2 లక్షలు మాత్రమే ఉంటుందని.. పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ పేర్కొన్నట్లుగా టన్నెల్లు ఏర్పాటు చేయడం సాధ్యమేనా అనే అంశంపై సమగ్ర నివేదిక సమర్పించాలని అడ్వొకేట్ జనరల్‌ను ఆదేశించింది. కృత్తిమ అవయవాలతో ఉన్న వారికి క్రమం తప్పకుండా వైద్యం అందాల్సి ఉంటుందని.. కాబట్టి వారికి, సహాయకులకు పాస్‌లు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ.. శివగణేశ్ అనే వ్యక్తి రాసిన లేఖపై హైకోర్టు విచారణ చేపట్టింది. కేవలం ప్రభుత్వంతో సాధ్యం కాదని.. అలాంటి వారికి సేవ చేసే స్వచ్ఛంద సంస్థల వివరాలు సేకరించాలని పిటిషనర్‌కు సూచించింది.
ఇవీ చూడండి: మహారాష్ట్రలో 24 గంటల్లో 368 కేసులు నమోదు