తెలంగాణ

telangana

ETV Bharat / state

HC on BJP MLAs Suspension: భాజపా సభ్యుల సస్పెన్షన్​పై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు.. - HC on BJP MLAs Suspension

HC on BJP MLAs Suspension: అసెంబ్లీ నుంచి సస్పెన్షన్​ను సవాల్ చేస్తూ భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ దాఖలు చేసిన పిటిషన్​పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఆ పిటిషన్​పై హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది.

HC on BJP MLAs Suspension: భాజపా సభ్యుల సస్పెన్షన్​పై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు..
HC on BJP MLAs Suspension: భాజపా సభ్యుల సస్పెన్షన్​పై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు..

By

Published : Mar 11, 2022, 4:20 AM IST

HC on BJP MLAs Suspension: శాసనసభలో భాజపా సభ్యుల సస్పెన్షన్​పై హైకోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. గురువారం భాజపా ఎమ్మెల్యేలు, అడ్వొకేట్ జనరల్ వాదనలు విన్న న్యాయస్థానం.. ఉత్తర్వులు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు జారీ చేస్తామని తెలిపింది. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్​ను సవాల్ చేస్తూ భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో వాదనలు జరిగాయి. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు గురువారం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ.. విఫలమయ్యాయని పిటిషనర్లు, హైకోర్టు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

నోటీసు ఇచ్చేందుకు అసెంబ్లీ కార్యదర్శి వద్దకు వెళ్లకుండా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని.. వాట్సప్ ద్వారా పంపించాలని భావించినప్పటికీ ఆయన ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉందని పిటిషనర్లు వివరించారు. రాజ్యాంగ విరుద్ధంగా, శాసనసభ నియమావళిని ఉల్లంఘించి సస్పెండ్ చేశారని భాజపా ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాష్ రెడ్డి వాదించారు. సభ నిర్వహణకు ఆటంకం కలగక పోయినా... స్పీకర్ ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా... సస్పెన్షన్ తీర్మానం ప్రవేశ పెట్టడం నిబంధనలకు విరుద్ధమన్నారు. సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీ నిర్వహణలో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details