కోర్టు ధిక్కరణ కేసులకు రూ. 58 కోట్ల కేటాయింపు జీవో తప్పుదోవ పట్టించేలా ఉందని హైకోర్టు (Highcourt) పేర్కొంది. ప్రభుత్వం చెబుతున్న ఉద్దేశాలు ప్రతిబింబించేలా... జీవో సవరించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. జీవో 208 (Go 208)పై లెక్చరర్ ప్రభాకర్ (Prabhakar) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.
జీవోలో పేర్కొన్న రూ. 58 కోట్ల నిధులు.. భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమని.. సీఎస్‌పై కోర్టు ధిక్కరణ కేసుల కోసం కాదని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ (Bs prasad) వివరణ ఇచ్చారు. నిధులు విడుదల చేయవద్దంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించాలని హైకోర్టును ఏజీ కోరారు. విచారణ సందర్భంగా తాము గతంలో వివరణ అడిగినప్పుడే ఎందుకు చెప్పలేదని ధర్మాసనం ప్రశ్నించింది. భూసేకరణ పరిహారం కోసమే నిధులు కేటాయించినట్లు ప్రస్తావిస్తూ జీవో సవరించాలని హైకోర్టు సూచించింది.