తెలంగాణ

telangana

ETV Bharat / state

Agnipath protest: ‘రైళ్లను తగులబెట్టడానికి రండి..’ వైరల్‌ అవుతోన్న వాట్సాప్‌ సందేశాలు - agneepath protest news

సికింద్రాబాద్‌ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్నటి ఘటనలో అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నారు. యువకుల వాట్సాప్‌ చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు. నిరసనలకు పిలుపునిస్తూ వాట్సాప్‌ గ్రూప్‌లో సర్య్కులేట్‌ అవుతున్న ఆడియో సందేశాలు ప్రస్తుతం వైరల్​ అవుతున్నాయి.

Agnipath protest: ‘రైళ్లను తగులబెట్టడానికి రండి..’ వైరల్‌ అవుతోన్న వాట్సప్‌ సందేశాలు
Agnipath protest: ‘రైళ్లను తగులబెట్టడానికి రండి..’ వైరల్‌ అవుతోన్న వాట్సప్‌ సందేశాలు

By

Published : Jun 18, 2022, 10:01 AM IST

అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో స్టేషన్‌లో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్‌ఏఎఫ్, సీఆర్‌పీఎఫ్, రైల్వే, తెలంగాణ పోలీసు బలగాలు స్టేషన్‌ వద్ద మోహరించారు. భారీ భద్రత నడుమ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. స్టేషన్ లోపలికి వచ్చే మార్గాల్లో భారీగా మోహరించిన బలగాలు.. ప్రయాణికులను క్షుణ్నంగా పరిశీలించాకే లోపలికి అనుమతిస్తున్నారు. స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో జనం గుమిగూడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.

మరోవైపు సికింద్రాబాద్‌ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్నటి ఘటనలో అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నారు. యువకుల వాట్సాప్‌ చాటింగ్‌లను పరిశీలిస్తున్నారు. నిరసనలకు పిలుపునిస్తూ వాట్సాప్‌ గ్రూప్‌లో సర్య్కులేట్‌ అవుతున్న ఆడియో సందేశాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. రైళ్లను తగలబెట్టడానికి రావాలంటూ వాట్సాప్‌ వాయిస్‌ సందేశాలు బయటకొచ్చాయి. అయితే ఆడియోలు ఎక్కడ నుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రయాణికుల ఇబ్బందులు..

ప్రయాణికుల భద్రత దృష్ట్యా సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రావాల్సిన రైళ్లను రైల్వే అధికారులు నగర శివారులోనే నిలిపివేస్తున్నారు. ప్రయాణికులను శివారులోని స్టేషన్లలో రైల్వే సిబ్బంది దించేస్తున్నారు. నగర శివారు నుంచి గమ్యస్థానం చేరేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల బైకులు, జీపులు, డీసీఎంల సాయంతో ప్రయాణికులను మల్కాజిగిరి పోలీసులు సమీప బస్టాప్‌కు చేరవేస్తున్నారు.

ఇవీ చూడండి..

Agnipath Protest: 'అగ్నిపథ్' విధ్వంసానికి దారితీసిన పరిస్థితులేంటి?

ABOUT THE AUTHOR

...view details