ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను విచారణలను పూర్తికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కోర్టుల్లో ఉన్న కేసుల విచారణలో సహకరించడానికి ప్రభుత్వం అదనపు ఎస్పీ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించింది. ఈ మేరకు హైదరాబాద్ నగర కమిషనరేట్ లో అదనపు డీసీపీగా ఎఎం.ఎ. బారిని కేటాయిస్తూ డీజీపీ కార్యాలయం నుంచి హైకోర్టుకు ఉత్తర్వులు వెల్లాయి. నేతలకు సమన్లు, జారీ చేయడం వంటివాటితో పాటు సాక్షులను పిలిపించడం వంటి వ్యవహరాల్లో పోలీసు శాఖతో సమన్వయకర్తగా వీరు వ్యవహరించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఉన్న కేసుల్లో చాలా వరకు సమన్లు అందక పెండింగ్ ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవల డీజీపీ, న్యాయశాఖ కార్యదర్శులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. ఎస్. చౌహన్ ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. సమన్ల జారీకి ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారికి సూచించారు. ప్రస్తుతం కొవిడ్ నేపథ్యంలో గత ఆరు నెలలుగా కోర్టులు జరగడంలేదు. విచారణ తేదీలను కూడా 15 రోజుల నుంచి నెల రోజుల వరకు వాయిదా వేస్తూ వచ్చాయి.
నిందితుల తరఫు న్యాయవాదులకు సమాచారం