తెలంగాణ

telangana

ETV Bharat / state

"ఆర్టీసీపై సమగ్ర సమాచారంతో విచారణకు రండి"

ఈనెల7న ఆర్టీసీ సమ్మెపై జరిగే విచారణకు అధికారులు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగానే ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని న్యాయస్థానం  అభిప్రాయపడింది.

ఆర్టీసీ సమ్మెపై విచారణకు హాజరుకావాల్సిందే: హైకోర్టు

By

Published : Nov 3, 2019, 5:39 PM IST

"ఆర్టీసీపై సమగ్ర సమాచారంతో విచారణకు రండి"

ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్ శర్మ, సీఎస్ ఎస్.కె.జోషి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌ను విచారణకు హాజరకావాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల7న ఆర్టీసీ సమ్మెపై జరిగే విచారణకు రావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని కోర్టు అభిప్రాయపడింది. నివేదిక వాస్తవ సమాచారానికి విరుద్ధంగా ఉందని పేర్కొంది. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నివేదిక, మంత్రికి ఆర్టీసీ ఇచ్చిన నివేదికకు విరుద్ధంగా ఉందన్న హైకోర్టు... ఈనెల 6వ తేదీలోగా వాస్తవాలతో నివేదిక సమర్పించాలని ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీని ఆదేశించింది. ఈ నెల 7న ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details