కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్డౌన్తో విపణిలో కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంపై హైకోర్టు స్పందించింది. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా న్యాయస్థానం స్వీకరించింది. ఫలక్నుమా రైతుబజారు, మీరాలంమండి, మెహదీపట్నం ప్రాంతాల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెంచారని కథనంలో వివరించారు.
ధరల పెరుగుదలపై స్పందించిన హైకోర్టు
కూరగాయల ధరల పెరుగుదలపై హైకోర్టు స్పందించింది. ఓ పత్రిక కథనాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యంగా ధర్మాసనం స్వీకరించింది.
high court
ఈ నేపథ్యంలో కూరగాయల ధరలతో పాటు నిత్యావసర వస్తువులు, పండ్ల ధరల నియంత్రణకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సి ఉందని పేర్కొంది. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ సీఎస్, వివిధ శాఖల ముఖ్యకార్యదర్శులు, సంబంధిత అధికారులను చేర్చారు. దీనిపై శుక్రవారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?