తెలంగాణ

telangana

ETV Bharat / state

వీఆర్వోల సర్దుబాటుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ.. - హైదరాబాద్ తాజా వార్తలు

Telangana High Court Adjustment Of Vros: రాష్ట్రంలో ఇతర శాఖల్లోకి వీఆర్వోల సర్దుబాటుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. వీఆర్వోల సర్దుబాటు తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు
హైకోర్టు

By

Published : Aug 3, 2022, 10:45 PM IST

Telangana High Court Adjustment Of Vros: రాష్ట్రంలో ఇతర శాఖల్లోకి వీఆర్వోల సర్దుబాటుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. వీఆర్వోల సర్దుబాటు తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ వీఆర్వోల సంఘం వేసిన పిటిషన్​పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విషయంపై రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details