ఇంటర్ ఫలితాలపై హైకోర్టులో పిటిషన్ - HIGH COURT
ఇంటర్ ఫలితాల గందరగోళంతో విద్యార్థులంతా అయోమయంలో పడిపోయారు. ఇవాళ బాలల హక్కుల సంఘం ఇంటర్మీడియట్ ఫలితాలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని లంచ్‌మోషన్ పిటీషన్ కింద విచారించేందుకు హైకోర్టు అనుమతిచింది.
ఇంటర్ ఫలితాలపై హైకోర్టులో పిటిషన్
ఇంటర్ ఫలితాలపై హైకోర్టులో బాలల హక్కుల సంఘం వ్యాజ్యం దాఖలు చేసింది. మళ్లీ మూల్యాంకనం చేయించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థులకు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. తప్పిదాలకు బాధ్యులైనవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని హైకోర్టుకు సూచించింది. లంచ్‌మోషన్ పిటీషన్ గా విచారించేందుకు ఉన్నతన్యాయస్థానం అనుమతించింది.