గిరిజనుల పట్ల రాష్ట్రప్రభుత్వ వైఖరికి నిరసనగా హైదరాబాద్ ధర్నా చౌక్‌లో లంబాడి గిరిజన జేఏసీ నిరహార దీక్ష చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని మాజీ మంత్రి రవీంద్ర నాయక్ హెచ్చరించారు. జనాభా నిష్పత్తి ప్రకారం లంబాడ గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాలని జేఏసీ నాయకుడు రాజేంద్ర కుమార్ జాదవ్ డిమాండ్ చేశారు.
'హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలి'
రాష్ట్రప్రభుత్వం గిరిజనుల పట్ల పక్షపాతం వహిస్తుందని లంబాడి గిరిజన జేఏసీ ఆరోపించింది. హైదరాబాద్ ఇందిరాపార్కులోని ధర్నాచౌక్‌లో లంబాడి గిరిజన జేఏసీ సభ్యులు నిరాహారదీక్షకు దిగారు. కేంద్ర ప్రభుత్వం, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దీక్ష చేస్తున్న లంబాడి గిరిజన జేఏసీ సభ్యులు