High Court about Corona : పిల్లల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలి: హైకోర్టు - తెలంగాణ వార్తలు
12:10 January 07
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ
High Court about Corona : కరోనా దృష్ట్యా పిల్లల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించిన హైకోర్టు.. కేంద్రం మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
జనం గుమిగూడకుండా నియంత్రించాలని.. మాల్స్, థియేటర్లలో కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. వాణిజ్య సముదాయాలు, వారాంతపు సంతల్లోనూ కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని హైకోర్టు ఆజ్ఞాపించింది. కరోనాపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: వరంగల్ నిట్‌లో కరోనా కలకలం.. ప్రత్యక్ష తరగతులు నిలిపివేత