జూనియర్ అకౌంట్స్ అధికారుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షపై పలువురు అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలతో సహా ప్రశ్న పత్రాలను నిపుణుల కమిటీకి నివేదించాలని తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థను హైకోర్టు ఆదేశించింది. తదుపరి నియామక ప్రక్రియను నిపుణుల బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా చేపట్టాలంది. ప్రశ్నపత్రం నోటిఫికేషన్‌కు విరుద్ధంగా ఉన్నందున... జూలైలో నిర్వహించిన పరీక్షను రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోటిఫికేషన్‌కు అనుగుణంగా పరీక్షకు సిద్ధమయ్యామని... సామర్థ్యానికి మించిన ప్రశ్నలుండడం వల్ల తాము నష్టపోయామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు అనువాదంలో కూడా తప్పులు దొర్లాయని తెలిపారు.
అభ్యంతరాలుంటే అప్పుడే చెప్పాలి