TSPSC Paper Leak Case Latest Update : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల లీకేజీకి సంబంధించి సిట్‌తో పాటు ఈడీ దర్యాప్తు పూర్తయ్యేదాక.. గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌లుదాఖలయ్యాయి. అంతేకాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్‌పీఎస్సీ నిర్వహించడంపై అభ్యంతరం ఉందని.. యూపీఎస్సీలాంటి మూడో సంస్థకు ఈ బాధ్యతను అప్పగించాలని వారు పిటిషన్‌లో కోరారు.
Petition in High Court to Postpone Group-1 exam : గతేడాది అక్టోబర్‌లో జరిగిన పరీక్షలను రద్దు చేయడంతో పాటు.. ఈనెల 11న గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ అశోక్ కుమార్‌తో పాటు మరో నలుగురు టి.రమేశ్, జె.సుధాకర్‌లు వేర్వేరుగా హైకోర్టులో మూడు పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కాజా శరత్ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ గత సంవత్సరం జరిగిన పరీక్షలు జరిగాక ప్రశ్నప్రత్రాలు లీకైన విషయం వెలుగులోకివచ్చిందని న్యాయస్థానానికి తెలిపారు.
TSPSC Paper Leak Case :దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటికే 49 మంది దాకా అరెస్ట్చేసిందని.. ఇది 100కు చేరవచ్చని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పరీక్షలు రద్దు చేసి తాజాగా నిర్వహించడానికి నిర్ణయించిందని చెప్పారు. లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని.. అలాంటప్పుడు తిరిగి అదే సంస్థ పరీక్ష నిర్వహిస్తే ఆ సంస్థ విశ్వసనీయతపై సందేహాలున్నాయని ధర్మాసనానికి వారు వివరించారు.