హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో డ్రైనేజీ, వరదనీటి నిర్వహణ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందంటూ డెక్కన్ ఆర్కియలాజికల్, కల్చరల్ రీసెర్చి సొసైటీలు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ ఆర్‌ఎస్‌చౌహాన్, జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వరద నీటి వ్యవస్థ సరిగా లేక వార్డుల్లో నీరు నిలుస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు.
వార్డుల్లోకి నీళ్లు రానివ్వకుండా చర్యలు తీసుకోండి: హైకోర్టు - తెలంగాణ హైకోర్టు వార్తలు
ఉస్మానియా ఆసుపత్రి వార్డుల్లోకి వరద నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రిలో వర్షం నీరు మూసీలో కలిసేలా ఏర్పట్లు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను నవంబర్ 12కు వాయిదా వేసింది.
వార్డుల్లోకి నీళ్లు రానివ్వకుండా చర్యలు తీసుకోండి: హైకోర్టు
గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ఉస్మానియా ఆసుపత్రిలో రోగులు ఇబ్బందిపడ్డారని హైకోర్టు ప్రస్తావించింది. మరో వారం, పది రోజులు వర్షాలు కురిసే అవకాశముందని చెబుతున్నందున ఆసుపత్రి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాల నేపథ్యంలో ఏం చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ నవంబర్ 12కు వాయిదా వేసింది.
ఇదీ చదవండిఃప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు ముమ్మర ఏర్పాట్లు