పురపాలక ఎన్నికలపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు వాదనలు పూర్తై తుది తీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్ విడుదల చేయొద్దని ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఇరువైపులా వాదోపవాదాలు నడిచాయి.
కుల ధ్రువీకరణ పత్రం పొందే సమయం కూడా ఇవ్వలేదు..
ఉత్తమ్ కుమార్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రక్రియలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటించలేదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొదట రిజర్వేషన్లు.. ఆ తర్వాత నోటిఫికేషన్, షెడ్యూల్ ప్రకటించాలని.. కానీ అన్నింటికంటే ముందే షెడ్యూల్ ప్రకటించారని ప్రకాశ్ రెడ్డి వాదించారు. రిజర్వేషన్లు ప్రకటించిన రెండు రోజుల తర్వాతే నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారని... దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రం పొందే సమయం కూడా లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.
నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నాం..