High Court notices to Madhusudanachari: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనచారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా గవర్నర్ కోటా కింద గోరేటి వెంకన్న, బస్వరాజ్ సారయ్య, దయానంద్‌ను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని సవాలు చేస్తూ ధనగోపాల్ అనే వ్యక్తి 2020లో పిటిషన్ దాఖలు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండగా.. 2021 నవంబరులో మధుసూదనచారిని ప్రతివాదిగా చేర్చాలంటూ.. ధనగోపాల్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని తప్పుబట్టారు. ఇది అలహాబాద్ హైకోర్టు తీర్పుకు విరుద్దంగా ఉందని న్యాయవాది పేర్కొన్నారు. అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ ఎమ్మెల్సీల నియామక వ్యవహారం గవర్నర్ విచక్షణాధికారంపై ఉంటుందని.. దీనికి రాజ్యాంగం అధికారం కల్పించిందన్నారు.