తెలంగాణ

telangana

ETV Bharat / state

'2006 జూనియర్​ లైన్​మెన్​ అభ్యర్థుల్లో అర్హులందరికీ ఉద్యోగాలు'

ఆ జూనియర్ లైన్​మెన్​ అభ్యర్థుల 14 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. 2006లో జూనియర్​ లైన్​మెన్ల పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారికి, 2013లో పోల్​క్లైమ్​ పరీక్ష పాసైన అభ్యర్థులందరికీ టీఎస్ ​ఎస్​పీడీసీఎల్​లో ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చింది.

By

Published : Oct 8, 2020, 7:16 PM IST

High Court Judgment on Junior Line Man Job
2006 జూనియర్​ లైన్​మెన్​ అభ్యర్థులందరికీ ఉద్యోగాలు: హైకోర్టు

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు 2006లో జూనియర్ లైన్​మెన్​ 2,553 పోస్టులకుగాను టీఎస్​ ఎస్​పీడీసీఎల్​ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈమేరకు తెలంగాణలోని వందలాది మంది ఐటీఐ అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు. కాగా వారికి 2013లో టీఎసీఎస్​పీడీసీఎల్​ పోల్ క్లైమ్ పరీక్షను యాజమాన్యం నిర్వహించింది.

హైకోర్టు తీర్పుతో అభ్యర్థులకు ఊరట

అయితే ఆపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఎవ్వరికీ ఇంతవరకు ఉద్యోగం ఇవ్వకపోవడం వల్ల అభ్యర్థుల తరఫున హైకోర్టులో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ రిట్ పిటిషన్ వేశారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన ధర్మాసనం 2006లో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ అభ్యర్థులతో పాటు పోల్​క్లైమ్ పరీక్షపాస్ అయిన వారందర్నీ జూనియర్ లైన్​మెన్లుగా ఉద్యోగంలోకి తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ నవీన తీర్పు ఇచ్చారు.

ఇదీ చూడండి:'బీమా చెల్లించినా... రైతులకు పరిహారం ఎందుకు చెల్లించడం లేదు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details