TS High court: మంచిరేవులలో రూ.వేల కోట్ల వివాదస్పద భూమిపై హైకోర్టు తీర్పు - land in Manchirevula
14:42 December 31
TS High court: మంచిరేవులలో రూ.వేల కోట్ల వివాదస్పద భూమిపై హైకోర్టు తీర్పు
TS High court: రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో రూ.వేల కోట్ల వివాదస్పద భూమిపై హైకోర్టు తీర్పును వెలువరించింది. గ్రేహౌండ్స్‌కు కేటాయించిన 142 ఎకరాలు ప్రభుత్వానిదేనన్న హైకోర్టు స్పష్టం చేసింది. 142 ఎకరాల భూమి విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని రెవెన్యూశాఖ వెల్లడించింది. 2007లో గ్రేహౌండ్స్‌కు ప్రభుత్వం 142 ఎకరాల భూమిని కేటాయించగా.. ఆ భూమి తమదేనంటూ 45మంది ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
2010లో పిటిషనర్లకు పరిహారం చెల్లించి భూసేకరణ చేయాలని సింగిల్ జడ్జి తీర్పును వెలువరించారు. సింగిల్ జడ్జి తీర్పును 2010లో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. ప్రభుత్వ అప్పీళ్లపై ఇవాళ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పును వెలువరించింది.
ఇదీ చదవండి: