ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డికి హైకోర్టు నోటీసులు - telangana news
19:12 February 01
ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డికి హైకోర్టు నోటీసులు
ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా పాపిరెడ్డి కొనసాగింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఓయూ పరిశోధక విద్యార్థి విజయ్ వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పాపిరెడ్డికి 65 ఏళ్లు దాటినా చట్ట విరుద్ధంగా కొనసాగిస్తున్నారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.
కొనసాగడానికి అర్హతలపై వివరణ ఇవ్వాలని పాపిరెడ్డికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం, పాపిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: 'మేం స్పందిస్తే.. మీ పార్టీకి అతీగతీ ఉండదు'