వైఎస్ షర్మిల బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించవద్దు: హైకోర్టు - తెలంగాణ వార్తలు
16:28 December 14
వైఎస్ షర్మిల బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించవద్దు: హైకోర్టు
Ts High Court: హైకోర్టు అనుమతిచ్చినా పాదయాత్రకు వెళ్లకుండా బ్యారికేడ్లు వేసి అడ్డుకుంటున్నారని వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం.. షర్మిల బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించవద్దని, ఆమె ఇంటి వద్ద ఉన్న బ్యారికేడ్లను వెంటనే తొలగించాలని పోలీసులను ఆదేశించింది. అయితే, అనుమతి లేకుండా షర్మిల.. ప్రగతిభవన్, రాజ్‌భవన్‌కు వెళ్లారని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బయటకి వెళ్లి శాంతిభద్రతల సమస్య సృష్టించారని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ధర్మాసనం సూచించింది.
ఇవీ చదవండి: