తెలంగాణ

telangana

ETV Bharat / state

కోర్టులో చోరీ కేసు.. సీబీఐకి అప్పగించిన ఉన్నత న్యాయస్థానం - Somireddy latest news

ఏపీలోని నెల్లూరు కోర్టులో సాక్ష్యాల చోరీపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకొంది. కోర్టులో సాక్ష్యాలు చోరీపై సుమోటోగా విచారించిన ధర్మాసనం.. విచారణను సీబీఐకి అప్పగించింది. దీనిపై హైకోర్టు సీజే జస్టిస్ పీకే.మిశ్రా సీబీఐ విచారణకు ఆదేశించారు.

HC orders CBI probe into theft in Nellore court
HC orders CBI probe into theft in Nellore court

By

Published : Nov 24, 2022, 4:44 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు కోర్టులో సాక్ష్యాల చోరీపై ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకొంది. కోర్టులో సాక్ష్యాలు చోరీపై సుమోటోగా విచారించిన న్యాయస్థానం.. విచారణను సీబీఐకి అప్పగించింది. హైకోర్టు సీజే జస్టిస్ పి.కె.మిశ్రా సీబీఐ విచారణకు ఆదేశించారు. నెల్లూరు కోర్టులో ఓ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు చోరీకి గురయ్యాయి. చోరీపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టుకు నెల్లూరు జిల్లా కోర్టు నివేదిక ఇచ్చింది.

సోమిరెడ్డికి విదేశాల్లో వేల కోట్లు ఆస్తులున్నాయని 2017లో ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. కాకాణి చూపిన పత్రాలు నకిలీవని.. పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం కాలంలో కేసు సాక్ష్యాలు చోరీకి గురయ్యాయి. కోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై హైకోర్టుకు నెల్లూరు ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి నివేదిక ఇచ్చారు. నివేదికలో పలు అనుమానాలు వ్యక్తం చేసిన నెల్లూరు పీడీజే... ఘటనాస్థలిలో డాగ్‌ స్క్వాడ్‌ను పిలవలేదన్నారు. నిందితుడు పగలగొట్టిన తలుపుపై వేలిముద్రలు, పాదముద్రలు సేకరించలేదని నివేదికలో పేర్కొ‌న్నారు. కేసులో దర్యాప్తు సరైన రీతిలో జరగట్లేదని అనుమానం వ్యక్తం చేస్తూ నివేదిక ఇచ్చారు. పీడీజే నివేదిక మేరకు సుమోటాగా తీసుకుని హైకోర్టు విచారణ జరిపింది.

ABOUT THE AUTHOR

...view details