రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఇప్పటికీ పదో తరగతి పరీక్షల నిర్వహణకే సిద్ధమవుతున్నారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పదో తరగతి పరీక్షలపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసం మరోసారి విచారణ చేపట్టింది. ఈనెల 8 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చునని గతంలో హైకోర్టు సూచించింది. అయితే ఈనెల 3న పరిస్థితులను సమీక్షించి.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే పరీక్షలకు ముందుకెళ్లవద్దని ఉన్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది.
కరోనా సమయంలో పదోతరగతి పరీక్షలా..! - ssc exams
కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పరీక్షలు నిర్వహిస్తారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇవాళ పదో తరగతి పరీక్షల నిర్వహణపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు విచారణ
ఈ నేపథ్యంలో కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ఇవాళ నివేదించారు. పదో తరగతి పరీక్షల కోసం జిల్లాల వారీగా చేసిన ఏర్పాట్లను వివరిస్తూ నివేదిక సమర్పించారు. ఏర్పాట్లకు సంబందించిన వీడియో ప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పిటిషన్పై రేపు విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
ఇవీ చూడండి: భాగ్యనగరంలో మోగుతున్న కరోనా ఘంటిక
Last Updated : Jun 4, 2020, 1:27 PM IST