సామాజిక భద్రత బోర్డు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
సామాజిక భద్రత బోర్డు ఏర్పాటు సంగతేంటి? : హైకోర్టు - హైదరాబాద్ లేటెస్ట్ వార్తలు
అసంఘటిత కార్మికుల కోసం రాష్ట్ర స్థాయి సామాజిక భద్రత బోర్డు ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సామాజిక భద్రత బోర్డు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది.
సామాజిక భద్రత బోర్డు ఏర్పాటుకు ఏం చర్యలు తీసుకున్నారు: హైకోర్టు
కౌంటరు దాఖలు చేసేందుకు మరో వారం రోజులు సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. కౌంటరు దాఖలు చేయడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సామాజిక భద్రత బోర్డు ఏర్పాటు కోసం ఇప్పటి వరకు ఏం చర్యలు చేపట్టారో తెలపాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:పోలీసుల సమక్షంలో అత్యాచార బాధితురాలిపై దాడి