తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓటర్లు వేరే చోటుకు మారినా నష్టం లేదు'

వార్డుల విభజనలో చిన్న చిన్న లోపాల వల్ల పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మున్సిపల్​ ఎన్నికలపై విచారణ జరిపిన హైకోర్టు ప్రస్తుతం ఉన్న పురపాలికలన్నీ భారీ విస్తీర్ణంలో ఏమీ లేవని... అందువల్ల వార్డుల పునర్విభజనలో ఓటర్లు ఇతర చోట్లకు మారినా నష్టమేమీ లేదని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వార్డుల విభజన చేశారని పిటిషనర్​ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే లోపాలను సవరించామని అదనపు అడ్వకేట్​ జనరల్​ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం.

మున్సిపల్​ ఎన్నికలపై విచారణ

By

Published : Sep 9, 2019, 7:31 PM IST

'ఓటర్లు వేరే చోటుకు మారినా నష్టం లేదు'
వార్డుల విభజనలో జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెద్దగా ఇబ్బందులేమీ ఉండవని హైకోర్టు అభిప్రాయపడింది. దీని వల్ల ఓటరుకు కూడా పెద్దగా సమస్యలు ఎదురుకావని పేర్కొంది. మున్సిపల్​ ఎన్నికలపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. వార్డుల విభజన, పునర్విభజన నిబంధనలకు విరుద్ధంగా చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కరీనంగర్, మహబూబ్​నగర్ పురపాలికల్లో జరిగిన లోపాలను ప్రస్తావిస్తూ... గత ఎన్నికల్లో ఒక వార్డులో ఓటు వేసిన ఓటరు ప్రస్తుతం మరో వార్డులో ఓటేయాల్సి వస్తోందని అన్నారు. దీనివల్ల ఓటరు ఇబ్బందులెదుర్కోవాల్సి ఉంటుందని వాదనలు వినిపించారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పురపాలికలన్నీ కూడా భారీ విస్తీర్ణంలో ఏమీ లేవని... అందువల్ల వార్డుల పునర్విభజనలో ఇతర చోట్లకు మారినా నష్టమేమీ లేదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

లోపాలను సరిదిద్దాం

మున్సిపల్​ ఎన్నికల కేసు విషయంలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్​పై అదనపు అడ్వకేట్​ జనరల్​ వాదనలు వినిపించారు. వార్డుల విభజన, మున్సిపల్ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లలో ఉన్న లోపాలను సరిదిద్దామని హైకోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చూడండి : యురేనియంపై ప్రత్యక్ష పోరాటానికి కాటమరాయుడు సై

ABOUT THE AUTHOR

...view details