Janwada Farmhouse: జన్వాడలో ఫాంహౌస్ వివాదంలో చెన్నై ఎన్జీటీ విచారణను సవాల్ చేస్తూ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శంకరపల్లి మండలం జన్వాడ వద్ద జీవో 111కు విరుద్ధంగా ఫాంహౌస్ నిర్మించారంటూ 2020లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెన్నై ఎన్జీటీలో ఫిర్యాదు దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ.. 2020లోనే కేటీఆర్కు నోటీసులు జారీ చేయడంతో పాటు క్షేత్రస్థాయి పరిశీలన కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా.. నోటీసులు, నిపుణుల కమిటీ ఏర్పాటుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్‌పై జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ పి.నవీన్ రావు ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
జన్వాడ ఫాంహౌస్ వివాదంలో కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ.. తీర్పు రిజర్వ్ - ktr latest news
Janwada Farmhouse: జన్వాడ ఫాంహౌస్ వివాదంలో మంత్రి కేటీఆర్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. చెన్నై ఎన్జీటీ విచారణను సవాల్ చేస్తూ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జన్వాడ వద్ద జీవో 111కు విరుద్ధంగా ఫాంహౌస్ నిర్మించారంటూ 2020లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెన్నై ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు.
రేవంత్ రెడ్డి రాజకీయ దురుద్దేశాలతో ఎన్జీటీకి ఫిర్యాదు చేశారని కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి వాదించారు. కేటీఆర్కు ఫాంహౌస్తో సంబంధం లేదన్నారు. నిర్మాణం జరిగిన ఆరు నెలల్లోనే ఎన్జీటీని ఆశ్రయించాలని.. దానికి విరుద్ధంగా పిటిషన్ వేశారని వాదించారు. జన్వాడ ఫాంహౌస్ తనదేనని.. అయితే ఎన్జీటీ కేసులో ప్రతివాదిగా లేనందున నేరుగా హైకోర్టు జోక్యం చేసుకోవాలని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరఘురాం వాదించారు. పిటిషన్లో రాజకీయ కారణాలేమీ లేవని.. నీటి సంరక్షణ ప్రయోజనాల కోసమే వేసినట్లు రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదించారు. ఎన్జీటీ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకే వెళ్లాలన్నారు. ఎన్జీటీ కేసుల్లో జోక్యం చేసుకొనే పరిధి హైకోర్టులకు ఉంటుందని అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు తెలిపారు. అన్ని వైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదీ చదవండి: