తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటరు జాబితా తాజాగా తయారు చేయండి: హైకోర్టు - హైకోర్టు వార్తలు

హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​ హౌసింగ్​ సొసైటీ ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్​పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఓటరు జాబితాను మళ్లీ తాజాగా సిద్ధం చేయాలని తీర్పునిచ్చింది.

ఓటరు జాబితా తాజాగా తయారు చేయండి: హైకోర్టు
ఓటరు జాబితా తాజాగా తయారు చేయండి: హైకోర్టు

By

Published : Jan 5, 2021, 10:25 PM IST

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ఓటర్ల జాబితాను మళ్లీ తాజాగా సిద్ధం చేయాలని హైకోర్టు ఆదేశించింది. రెండు నెలల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.

ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని.. కొందరు అర్హులకు ఓటు హక్కు రాలేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెల్లడించింది. అర్హులైన ఓటర్లతో కొత్త జాబితా తయారు చేసి ప్రచురించాలని.. ఆ తర్వాత రెండు వారాలు అభ్యంతరాలు స్వీకరించాలని స్పష్టం చేసింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని తీర్పునిచ్చింది.

ఇదీ చదవండి:యువతి కడుపులో రెండున్నర కిలోల వెంట్రుకల ముద్ద..!

ABOUT THE AUTHOR

...view details