రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు (Highcourt) ఇవాళ మరోసారి విచారణ చేపట్టనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఈరోజు విచారణ జరపనుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, డీజీపీలు వేర్వేరుగా నివేదికలు సమర్పించనున్నారు.
Highcourt: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మరోసారి విచారణ - Corona latest updates
తెలంగాణలో కొవిడ్ విపత్కర పరిస్థితులపై హైకోర్టు (Highcourt) ఈరోజు విచారణ చేపట్టనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఈరోజు విచారణ జరపనుంది.
హైకోర్టు
మూడో దశ కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు సన్నద్ధత, బ్లాక్ ఫంగస్ చికిత్సలు ఔషధాల వివరాలు సమర్పించాలని ధర్మాసనం తెలిపింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు, పరీక్షలపై గరిష్ఠ పరిమితులు విధిస్తూ జీవో జారీ చేయలని చెప్పింది. వీటన్నింటితో పాటు ప్రస్తుత పరిస్థితులపై ధర్మాసనం విచారణ జరిపి పలు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
ఇదీ చూడండి:LOCK DOWN: రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్ అమలు