తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో వారం రోజులు గడువు - మున్సిపాలిటీ ఎన్నికలపై హైకోర్టు వారం రోజుల గడువు

మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కౌంటరు దాఖలు చేసేందుకు వారం రోజులు గడువివ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు మన్నించింది. కొత్త మున్సిపాలిటీల వల్ల ఓటర్ల జాబితా ప్రచురణకు సమయం పడుతుందని అదనపు ఏజీ రామచంద్రరావు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.

మున్సిపాలిటీ ఎన్నికలు

By

Published : Jun 11, 2019, 11:29 PM IST

మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టడం లేదంటూ దాఖలైన వ్యాజ్యంలో... వివరణ ఇచ్చేందుకు వారం రోజులు గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. కొత్త మున్సిపాలిటీలు ఏర్పడడం వల్ల ఓటర్ల జాబితా ప్రచురణకు కొంత సమయం పడుతుందని అదనపు ఏజీ రామచంద్రరావు న్యాయస్థానానికి తెలిపారు. సర్కారు... వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు ఖరారు చేయడం లేదంటూ రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు బీసీ సంక్షేమ సంఘం దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు గతంలో విచారణ జరిపింది. రెండు వారాల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గడువు రేపటితో ముగుస్తున్నందున పిటిషనర్ల తరఫు న్యాయవాది దీనిని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే కౌంటరు దాఖలు చేసేందుకు సర్కారు గడువు కోరడంతో... ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది.

మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో వారం రోజుల గడువు

ABOUT THE AUTHOR

...view details