తెలంగాణ

telangana

ETV Bharat / state

కారు డ్రైవ్​ చేయలేదు: నటుడు సుధాకర్​ - hero

గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద రోడ్డు ప్రమాద సమయంలో తాను కారు డ్రైవ్​ చేయలేదని... డ్రైవరే కారు నడిపాడని వర్ధమాన సినీ నటుడు సుధాకర్​ అన్నారు. ప్రమాదంలో లక్ష్మీ అనే మహిళ చనిపోవడం బాధాకరమన్నారు.

సుధాకర్​

By

Published : Apr 28, 2019, 5:58 PM IST

వర్ధమాన సినీ నటుడు సుధాకర్ కోమాకుల... శనివారం కారు ప్రమాదంలో గాయపడ్డారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సుధాకర్ ..... నువ్వు తోపురా సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఈ చిత్రం ప్రయోషన్స్​లో భాగంగా వెళ్తుండగా సుధాకర్ గుంటూరు జిల్లామంగళగిరి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుధాకర్ కారు ఢీకొని లక్ష్మీ అనే మహిళ చనిపోయారు. ఆ సమయంలో తానే డ్రైవింగ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను సుధాకర్ ఖండించారు. తాను డ్రైవర్ పక్కసీటులో ఉన్నానని... హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్​లో స్పష్టం చేశారు. ప్రమాదంలో లక్ష్మీ అనే మహిళ చనిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.ఇవీ చూడండి: సాధ్వి.. శపిస్తే సరిపోయేది కదా?: దిగ్విజయ్​

కారు డ్రైవ్​ చేయలేదు: నటుడు సుధాకర్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details