ప్రచారం చేసిన సెలబ్రిటీలపై దృష్టి
హీరా గోల్డ్ వ్యవహారంలో మదుపరుల నుంచి సేకరించిన 5వేల కోట్ల పెట్టుబడులపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఆ పెట్టుబడులు సంస్థ ఖాతాలకు కాకుండా ఎక్కడకు మళ్లాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. హీరాగోల్డ్‌కు ప్రచారం చేసిన సెలబ్రిటీలపై దృష్టి సారించారు.
ఆధారాలు లభిస్తే కఠిన చర్యలు
శాఖల విస్తరణలో భాగంగా.. నౌహీరా షేక్ ముంబయి, దిల్లీ, దుబాయి, అబుదాబీలో.. అయిదేళ్ల క్రితం కార్యాలయాల ప్రారంభోత్సవంలో ఇద్దరు బాలీవుడ్ కథానాయకులు, మాజీ క్రికెటర్, మరో క్రీడాకారిణి పాల్గొన్నట్టు గుర్తించారు. ప్రచారం చేసినందుకు డబ్బు తీసుకున్నారా, స్నేహపూర్వకంగా హాజరయ్యారా అనే అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ అయిదుగురిలో ఇద్దరికి... హీరాగోల్డ్ కంపెనీల్లో వాటాలున్నాయనే ప్రచారంపై విచారణ జరుపుతున్నారు. ముంబయి పోలీసులను సంప్రదించి సెలబ్రిటీలు ప్రచారం చేసినట్లు ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.