తెలంగాణ

telangana

ETV Bharat / state

గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద భారీగా నిలిచిన వాహనాలు - గరికపాడు చెక్‌పోస్ట్ తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా గరికపాడు చెక్​పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి వస్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పాస్​లు ఉన్నవారికి మాత్రమే అనుమతినివ్వడంతో.. చెక్‌పోస్ట్ వద్ద అర కిలోమీటరు వరకు వాహనాలు నిలిచిపోయాయి.

Garikapadu check post
Garikapadu check post

By

Published : Jun 1, 2020, 1:23 PM IST

కృష్ణా జిల్లా గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. తెలంగాణ నుంచి ఆంధ్రాకు వస్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తూ..వారికి చేతిపై హోం క్వారంటైన్‌ ముద్ర వేస్తున్నారు. 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వాహనాదారులకు సూచిస్తున్నారు.

పాస్​లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇస్తుండటంతో.. చెక్‌పోస్ట్ వద్ద అర కిలోమీటరు వరకు వాహనాలు నిలిచిపోయాయి. అనుమతులు లేని వారిని వెనక్కి తిప్పి పంపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details