తెలంగాణ

telangana

ETV Bharat / state

HEAVY RAINS: నేడు, రేపు  అతి భారీ వర్షాలు! - rains news in telangana

ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో భారీ, అతి భారీ వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

heavy rains in telangana
heavy rains in telangana

By

Published : Jul 15, 2021, 3:21 PM IST

Updated : Jul 16, 2021, 5:17 AM IST

తూర్పు విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 4.5 కి.మీ ఎత్తున కొనసాగుతోంది.ఫలితంగా ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ రెండ్రోజులు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపారు.

బుధవారం.. హైదరాబాద్​ సహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జోరు వానలు కురిసింది. భాగ్యనగరంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లుతూ.. వాననీరు, డ్రైనేజీ నీళ్లు కలిసి ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల అపార్టుమెంట్ల సెల్లార్లలో నీరు చేరింది. నిత్యావసర సరకులకు వెళ్లేందుకు సైతం ప్రజలు అవస్థలు పడుతున్నారు.

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు!

ఇదీచూడండి:hyderabad floods: సరూర్​నగర్​లో వరదలు.. ఇళ్లు వదిలివెళ్తున్న స్థానికులు

Last Updated : Jul 16, 2021, 5:17 AM IST

ABOUT THE AUTHOR

...view details