రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు, ఎల్లుండి చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రాష్ట్రంలో విస్తారంగా మోస్తరు వర్షాలు...!
తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడటం వల్ల... 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. ఈ మార్పులతో రాష్ట్రంలో చాలా చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు స్పష్టం చేశారు.
తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలలో ఇవాళ ఉదయం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దానికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్ది దక్షిణ దిశకు వంపు తిరిగి ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర నుంచి ఇంటీరియర్ ఒడిశా వరకు... తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా 4.5కి.మీ. నుంచి 7.6 కి.మీ మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతోందన్నారు. ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి: సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ