ప్ర. అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై ఉంటుందా..? ఏఏ జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది..?
జ. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇదీ ప్రస్తుతం ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరంలో ఉంది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం తెలంగాణ వైపునకు కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, రూరల్, వికారాబాద్, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. హైదరాబాద్లో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ప్ర. ఎన్ని రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది..?
జ.ఈరోజు, రేపు అల్పపీడన ప్రభావం ఉంటుంది. ఎల్లుండి వరకు కొంత తగ్గుతుంది. అల్పపీడనం ఉత్తర దిశగా వెళ్లే అవకాశం ఉంది.
ప్ర. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందా..?
జ.ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం చాలా తక్కువగా ఉంది.