రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. మిగతా ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో 1,500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఉందని... దీని ప్రభావం వల్ల బంగాళాఖాతం ఒడిశా తీర ప్రాంతంలో ఆదివారంలోగా అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. విదర్భ ప్రాంతంలో 3,100 మీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఉందన్నారు. నిన్న 403 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా వాజేడులో 78.3, అలుబాకలో 77, వెంకటాపురంలో 67.8, మంగపేటలో 44.8, తిర్యానీలో 40, ఎల్కపల్లిలో 36.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు - HEAVY RAINS IN STATE
రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రేపటిలోగా... అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు తెలిపారు.
HEAVY RAINS IN STATE
Last Updated : Aug 24, 2019, 7:34 AM IST
TAGGED:
HEAVY RAINS IN STATE