TS Weather Report: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్, ఖైరతాబాద్, సోమాజీగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, బోలక్‌పూర్, కవాడిగూడ, జవహర్‌నగర్, దోమలగూడ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లేవారు, స్కూల్‌కు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. రోడ్లపై మురుగునీరు ఏరై పారుతోంది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
TS Weather Report: భాగ్యనగరాన్ని వరుణుడు వదలేడం లేదు. ఈరోజు ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీనితో ఆఫీసులకు, కాలేజీలకు, స్కూల్స్‌కు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు ఏరై పారుతోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక రాష్ట్రంలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. కొత్తగూడెం, మహబూబాబాద్ , వరంగల్, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాముందని వెల్లడించింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుముల, మెరుపులతో వర్షాలు పడతాయని తెలిపింది. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో వర్షం మోస్తరుగా పడనుందని వివరించింది.
ఇవీ చదవండి: