తెలంగాణ

telangana

ETV Bharat / state

తడిసిముద్దయిన నగరం.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, రహదారులు

భాగ్యనగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు, డ్రైయిన్లు నీటితో మునిగిపోయాయి. ఉస్మానియా ఆసుపత్రి జలాశయాన్ని తలపించింది. బాలానగర్‌లో అత్యధికంగా 95.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.

heavyheavy rains in hyderabad rains in hyderabad
heavy rains in hyderabad

By

Published : Jul 16, 2020, 8:53 AM IST

నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునిగాయి. డ్రెయిన్లు ఉప్పొంగాయి. ఉస్మానియా ఆసుపత్రి జలాశయాన్ని తలపించింది. పాత భవంతుల్లో, లోతట్టు కాలనీల్లో నివసిస్తున్నవారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బుధవారం వాన కురుస్తూనే ఉంది. మధ్య మధ్యలో తీవ్రత పెరిగింది. రోడ్లపై వరద పారి ఇసుక మేట వేసింది. బాలానగర్‌లో అత్యధికంగా 95.8 మిల్లీమీటర్లు, ఫతేనగర్‌లో 85.3, ఫిరోజ్‌గూడలో 80.8, బేగంపేటలో 70.0 మి.మీ. వర్షం కురిసింది. గ్రేటర్‌ వ్యాప్తంగా సగటున 22.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. మల్కాజిగిరిలోని షిర్డీనగర్‌, ఎన్‌ఎండీసీ కాలనీలు ముంపునకు గురయ్యాయి. యూసుఫ్‌గూడలోని శ్రీకృష్ణనగర్‌ను వరద ముంచెత్తింది. అంబర్‌పేటలోని ఓ పాతభవనం పెచ్చులు ఊడిపడటంతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు. పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.

ఎక్స్‌ప్రెస్‌ హైవే కింద నిలబడిన వాహనదారులు వీరు.

ఆయా ప్రాంతాల్లో వర్షపాతం వివరాలు మిల్లీ మీటర్లలో (రాత్రి 8 గంటల సమయానికి)

ABOUT THE AUTHOR

...view details