Heavy Rains in Hyderabad Today :హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి కురిసిన ఏకధాటి వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. పలు కాలనీలు, ఇళ్లు నీట మునిగాయి. అనేక చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. నగరంలో కురిసిన భారీ వర్షానికి(Heavy Rains in Hyderabad) పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. భారీ వరదలతో రహదారులన్నీ జలమయం కాగా.. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షం కారణంగా విద్యార్థులు.. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల రహదారులపై నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం(Huge Traffic in Hyderabad) ఏర్పడింది.
Telangana Rains : రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
Hyderabad Floods Today :కూకట్‌పల్లిలోని అల్విన్‌కాలనీలో మంచును తలపించేలా వరద ప్రవాహంపై తెల్లని నురగ పేరుకుపోయింది. బౌరంపేటలోని ల్యాండ్ మార్క్-2 గేటెడ్ కమ్యూనిటీలో మ్యాన్‌హోల్ నుంచి వరద పోటెత్తింది. టోలిచౌకీలోని వంతెనపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ నుంచి మూసాపేట్ వెళ్లే ప్రధాన రహదారి సైతం వాహనాలతో కిక్కిరిసిపోయింది. మూసాపేట్ మెట్రో స్టేషన్ కిందభారీగా వర్షపు నీరు నిలిచింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతినగర్‌లో ద్విచక్రవాహనాలు(Two wheelers) మునిగిపోయే స్థాయిలో రోడ్డుపై వరదనీరు పారింది. తెల్లాపూర్‌లో ఓ పాఠశాల బస్సు రోడ్డుపై కూరుకుపోయింది. యూసఫ్‌గూడలోనూ వరద ధాటికి వాహనాలు కొట్టుకుపోయాయి.
Huge Traffic in Hyderabad Rains : వరుణ్ బ్రో కొంచెం గ్యాప్ తీసుకో.. ఈ ట్రాఫిక్‌లో ఇళ్లు చేరేదెలా..?
Hyderabad Rains :బోయిన్‌పల్లిలోని హస్మత్ పేట ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు రావడంతో.. ఆ ప్రాంతమంతా చెరువును తలపిస్తోంది. రామన్నకుంట చెరువు సమీపంలోని శ్రీనివాసనగర్ కాలనీలో రహదారిపై పూర్తిగానీరు నిలిచి వాహనాలు మునిగిపోయే పరిస్థితి నెలకొంది. చింతల్‌లోని ఇంద్రసింగ్ నగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరుకోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏటా ఇదే పరిస్థితి ఏర్పడుతుందని, అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని ఆ కాలనీవాసులు కోరుతున్నారు.