ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు! - telangana rains news
రానున్న మూడ్రోజులు తెలంగాణలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు!
ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణం, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.