తెలంగాణ

telangana

By

Published : Sep 26, 2020, 7:52 AM IST

ETV Bharat / state

కర్నాటక మీదుగా ఆవర్తనం.. దక్షిణ తెలంగాణకు వర్షగండం

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్​లో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. రంగారెడ్డి జిల్లా నందిగామలో అత్యధికంగా 18.3 సెం.మీ. వర్షపాతం నమోదయింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది

heavy rain in telangana
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలు

ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్​లో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. రాజేంద్రనగర్, అత్తాపూర్, హిమాయత్‌సాగర్‌, గండిపేట్, శంషాబాద్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, బాలానగర్, దుండిగల్, కొంపల్లిలో వాన కురుస్తూనే ఉంది.

రంగారెడ్డి జిల్లా నందిగామలో అత్యధికంగా 18.3 సెం.మీ. వర్షపాతం నమోదయింది. కరీంనగర్​ జిల్లా చిగురుమామిడిలో 17.9 సెం.మీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇలంతకుంటలో 15.5 సెం.మీ, రంగారెడ్డి జిల్లా కోత్తూర్‌లో 14.3 సెం.మీ, ఫరూక్‌నగర్‌లో 14.3 సెం.మీ, వరంగల్‌ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో 13.9 సెం.మీ, సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 13.8 సెం.మీ, సిద్దిపేట జిల్లా వర్గల్‌లో 13.4 సెం.మీ, వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో 13.3 సెం.మీ. వర్షపాతం నమోదయింది.

తెలంగాణను ఆనుకొని ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇదీ చదవండి:వ్యవసాయ బిల్లుల ఆమోదంతో యార్డుల పాత్ర నామమాత్రం

ABOUT THE AUTHOR

...view details