హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘావృత్తమైన ఆకాశం.. సాయంత్రానికి ఒక్కసారిగా మబ్బులు కమ్మింది. కూకట్‌పల్లి, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, నాంపల్లి, కోఠి, బేగంబజార్, అంబర్‌పేట ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
భాగ్యనగరంలో భారీ వర్షంతో చల్లబడిన వాతావరణం - భాగ్యనగరంలో భారీ వర్షం
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది.
భాగ్యనగరంలో భారీ వర్షంతో చల్లబడిన వాతావరణం
కుత్బుల్లాపూర్, జీడిమెట్ల మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లో భారీ వర్షం కురిసింది. జేబీఎస్, కార్ఖానా, నాగారం, కుషాయిగూడ, దమ్మాయిగూడ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి:కడుపున బిడ్డను మోస్తూ.. 142కి.మీ కాలినడక