హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, బేగంపేట, అమీర్‌పేట ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లు నిండిపోయాయి. ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
భాగ్యనగరంలో వర్షం.. పలు చోట్ల ప్రజలకు ఇక్కట్లు
హైదరాబాద్ నగరంలో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలకు వరద ప్రవాహం చేరుతోంది. రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
భాగ్యనగరంలో వర్షం.. పలు చోట్ల ప్రజలకు ఇక్కట్లు
అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. మరో రెండురోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి :రెండు గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు