అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. వానకు నగర రోడ్లు చెరువులను తలపించాయి. నిత్యం రద్దీగా ఉండే కోఠి, ఏంజె మార్కెట్, అబిడ్స్, నాంపల్లి, నారాయణగూడ ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై మోకాళ్ల లోతు నిలిచిపోయింది.
సాయంత్రం సమయంలో విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్ హొల్స్ ను తెరిచారు.