ఏపీలోని గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురంలోని రేకుల ఇంట్లో ఓ వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమె వాడే కరెంటు.. మహా అయితే ఓ లైటు.. ఓ ఫ్యానుకు మాత్రమే. అది కూడా రోజంతా వాడదు. అయినా.. ఆ పేద వృద్ధురాలికి అధికారులు 2 వేల 953 రూపాయల బిల్లు పంపారు. నెల నెలా వంద రూపాయలలోపే వచ్చే కరెంటు బిల్లు.. ఒకేసారి ఇంతలా వచ్చేసరికి ఆ వృద్ధురాలికి మతి పోయింది. ఇదెలా జరిగిందని.. అధికారులను అమాయకంగా అడుగుతోంది. ఆమె కష్టం తీర్చాల్సింది విద్యుత్ శాఖ అధికారులే.
ఫ్యాన్, బల్బుకు రూ.2,953 కరెంట్ బిల్లా?
ఇంట్లో ఒక ఫ్యాన్, ఒక బల్బు ఉంటే.. మహా అయితే వందో రెండొందలో కరెంట్ బిల్లు వస్తుంది. కానీ ఓ వృద్ధురాలికి మాత్రం ఏకంగా ఆ ఊళ్లో సగం ఇళ్లకు వచ్చే బిల్లును వేసినట్టున్నారు అధికారులు. వందలు దాటి వేలకు...వెళ్లింది కరెంటు బిల్లు. తల పట్టుకోవడం వృద్ధురాలి వంతైంది.
కరెంట్ బిల్లుతో వృద్ధురాలు