దిల్షుఖ్నగర్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కొత్తపేట నుంచి కోఠికి వెళ్లే రహదారిపై నీరు అధికంగా చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఐస్ సాధాన్ డివిజన్ సింగరేణి కాలనీ... రాత్రి కురిసిన వర్షానికి నిండా మునిగిపోయి... చెరువులను తలపిస్తోంది.
చెరువులను తలపిస్తున్న కాలనీలు... నీటిలోనే ప్రజలు - హైదరాబాద్లో వరదలు
రాత్రి కురిసిన వర్షాలకు నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రహదారిపై భారీ స్థాయిలో నీరు ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దిల్షుఖ్నగర్లో నీరు అధికంగా ఉండడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది.
చెరువులను తలపిస్తున్న కాలనీలు... రహదారిపై ట్రాఫిక్ జాంలు
కొన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నామని స్థానికులు పేర్కొన్నారు. తమ సమస్యను పట్టించుకుని... త్వరలోనే పరిష్కరించాలని కోరుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి... ట్రాక్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు వంటి సదుపాయాలు అందిస్తున్నారు.
ఇదీ చూడండి:హైదరాబాద్లో వర్షం... వరద బాధితుల పరిస్థితి దయనీయం